MANA TOLIVELUGU
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 8:46 pm Posted by : MANA TOLIVELUGU

పట్టభద్రుల ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

మోత్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాచకొండ బాలరాజు గౌడ్

మన తొలివెలుగు | మోత్కూర్ ప్రతినిధి పబ్బు ప్రవీణ్ (04 అక్టోబర్ 2026) :

నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మోత్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాచకొండ బాలరాజు గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైనదని, ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన పట్టభద్రులు సంబంధిత ఎన్నికల నిబంధనల ప్రకారం వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో ఓటరుగా నమోదైన వారు కూడా నిబంధనల ప్రకారం కొత్తగా మళ్లీ నమోదు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నవంబర్ 6వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.